భైరవగీత ట్రైలర్ విడుదల

SMTV Desk 2018-09-01 15:53:24  Bhairava Geetha Trailer, RGV,

నాగ్ హీరోగా నటించిన ఆఫీసర్ సినిమా డిజాష్టర్ అవడంతో కొంత గ్యాప్ తీసుకున్న ప్రముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి దర్శకుడిగా కాకుండా ప్రజెంటర్‌గా మారి సమర్పిస్తున్న భైరవగీత సినిమా ట్రైలర్ ఇవాళ రిలీజైంది. ధనంజయ, ఇర్రా జంటగా నటించిన ఈ సినిమాతో సిద్ధార్ధ అనే ఓ కొత్త దర్శకుడు పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. త్వరలోనే సినిమా రిలీజ్‌కి రెడీ అవుతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. సీమలోని ఒక గ్రామం .. ఆ గ్రామంలోని ఒక ప్రేమికుల జంట .. ఆ జంటను విడదీసేందుకు అమ్మాయి కుటుంబ సభ్యులు చేసే ప్రయత్నాలు .. వాళ్లను ధైర్యంగా ఆ ప్రేమికుడు ఎదుర్కోవడం ప్రధానంగా ఈ టీజర్ ను కట్ చేశారు