తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీ

SMTV Desk 2018-08-31 16:50:41  Allu Arjun, Tamil Director Shiva,

నా పేరు సూర్య తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాత సినిమా ఇంకా ఎనౌన్స్ చేయలేదు. మనం డైరక్టర్ విక్రం కుమార్ తో బన్ని సినిమా దాదాపు కన్ఫాం అయినట్టే అని తెలుస్తుండగా మరో తమిళ దర్శకుడు శివతో బన్ని సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. తెలుగులో శౌర్యం, శంఖం, దరువు సినిమాలు చేసిన శివ తమిళంలో అజిత్ తో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. వీరం, వేదాలం సినిమాలు సూపర్ హిట్ అందుకోగా ఆ తర్వాత వచ్చిన వివేగం నిరాశపరచింది. ప్రస్తుతం మళ్లీ అజిత్ హీరోగా విశ్వాసం సినిమా చేస్తున్నాడు అజిత్. ఈ సినిమా పూర్తి కాగానే బన్నితో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకు కేయి జ్ఞానవెల్ రాజా నిర్మాతగా ఉంటారట. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. బన్ని, లింగుసామి కాంబినేషన్ లో ఓ బైలింగ్వల్ ముహుర్తం పెట్టుకున్నా కూడా అది అటకెక్కింది. మరి ఇప్పుడు శివ సినిమా అయినా సెట్స్ మీదకు వెళ్తుందో లేదో చూడాలి.