ప్రగతి నివేదన సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్....

SMTV Desk 2018-08-31 14:03:31  trs,telangana,haicort,pragatinevedanashabha,rangaedy

గడిచిన నాలుగు సంవత్సరాల్లో తమ అధికార పార్టీ చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు టీఆర్ఎస్ పార్టీ ‘ప్రగతి నివేదన సభను నిర్వహిస్తోంది.ఈ సభను అనుసరించి 1600 ఎకరాల్లో చెట్లు అన్ని నరికేస్తున్నారని ఈ సభ ఆపేయాలంటూ హైకోర్టులో పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు ఈ రోజు తిరస్కరించింది. దాఖలైన పిటిషన్ ను ఈరోజు హైకోర్టు కొట్టివేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సభ కోసం 25 లక్షల మందిని సమీకరిస్తున్నారనీ, లక్ష వాహనాలను వాడుతున్నారని పిటిషనర్ ఆయన కోర్టుకు తెలిపారు. అయితే పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ప్రగతి నివేదన సభకు అనుమతి ఇస్తూ హైకోర్టు తీర్పును ఇచ్చింది.