రివ్యూ: నర్తనశాల

SMTV Desk 2018-08-30 16:35:19  At narthanashala, Naga Shaurya,

బ్యానర్‌: ఇరా క్రియేషన్స్‌ తారాగణం: నాగశౌర్య, కష్మీరా, అజయ్‌, జయప్రకాష్‌ రెడ్డి, యామిని భాస్కర్‌, శివాజీ రాజా, సుధ, రాజేష్‌ తదితరులు సంగీతం: మహతి స్వర సాగర్‌ కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు - తమ్మిరాజు ఛాయాగ్రహణం: విజయ్‌ సి. కుమార్‌ నిర్మాత: ఉష ముల్పూరి రచన, దర్శకత్వం: శ్రీనివాస్‌ చక్రవర్తి విడుదల తేదీ: ఆగస్ట్‌ 30, 2018 ఛలో విజయం తరువాత యంగ్ హీరో నాగశౌర్య ఉత్సాహంతో ఉన్నాడు. ఛలో చిత్రంతో నాగశౌర్య నటించే సినిమాలపై యువతలో ఆసక్తి పెరిగింది. నాగశౌర్య నటించిన తాజా చిత్రం నర్తనశాల. శ్రీనివాస్ చక్రవర్తి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కాశ్మీర, యామిని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. క‌థ‌: క‌ళామందిర్ క‌ళ్యాణ్ (శివాజీరాజా) క్లోత్ షోరూం ఉంటుంది. ఈయ‌న అమ్మ చ‌నిపోవ‌డంతో మ‌ళ్లీ త‌న క‌డుపున పుడుతుంది అనుకుంటాడు. కానీ అబ్బాయి(నాగ‌శౌర్య‌) పుట్టేస్తాడు. అమ్మాయి పుట్ట‌లేద‌ని తెలిస్తే తండ్రి చ‌చ్చిపోతాడేమో అని అమ్మాయిలాగే శౌర్య‌ను పెంచుతాడు. శౌర్య కూడా పెళ్లంటే ఫీలింగ్స్ లేవంటూ తిరుగుతుంటాడు. ఇలాంటి కుర్రాడి జీవితంలోకి మాన‌స‌(కాష్మీర్ ప‌ర్దేశీ) వ‌స్తుంది. ఈమెను చూడ‌గానే హీరో కూడా ఇష్ట‌ప‌డ‌తాడు. కానీ అదే స‌మ‌యంలో స‌త్య‌(యామిని భాస్క‌ర్) కూడా శౌర్య‌ను ఇష్ట‌ప‌డుతుంది. దాంతో ఆమె నుంచి త‌ప్పించుకోడానికి గే అనే అబ‌ద్ధం ఆడ‌తాడు శౌర్య. అప్ప‌ట్నుంచి ఏం జ‌రుగుతుంది.. ఎలా హీరో అది కాదు అని నిరూపించుకుంటాడు అనేది క‌థ‌.. ఎవరెలా చేశారంటే: నాగ‌శౌర్య ఇలాంటి గే పాత్ర‌లో న‌టించ‌డం కొత్త విష‌య‌మే. క‌థ‌లో ఇదే యూనిక్ పాయింట్ అని ఓకే చేసాడేమో మ‌రి. అయితే ఆ సీన్స్ త‌ప్పిస్తే మిగిలిన వాటిలో బాగానే న‌టించాడు. హీరోయిన్లు కాష్మీర్ ప‌ర్దేశీ, యామిని భాస్క‌ర్ ల‌కు క‌థ‌లో పెద్ద‌గా ఇంపార్టెన్స్ అయితే లేదు. అజ‌య్ గే గా బాగా చేసాడు. కానీ అత‌డికి పెద్ద‌గా స్కోప్ లేని పాత్ర ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, శివాజీరాజా కామెడీని బాగానే మోసారు. కానీ క‌థ ఉన్న ప‌ల‌చ‌ద‌నానికి వాళ్ల కామెడీ స‌రిపోలేదు. హీరో ఫ్రెండ్ కూడా బాగానే చేసాడు. బలాలు: + సినిమాలో పాయింట్‌ + నాగశౌర్య, అజయ్‌ మధ్య వచ్చే సన్నివేశాలు బలహీనతలు: - నటీనటుల ఓవర్‌యాక్షన్‌ - అక్కడక్కడా బోర్‌ కొట్టించే సన్నివేశాలు