అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన హాలీవుడ్‌ దర్శకుడు జార్జ్‌ ల్యూకాస్‌

SMTV Desk 2017-07-17 15:59:41  JARGE LYUKAAS, AUTOGRAPH, MOVIES, EARN MONEY, PRESS CONFIRENCE.

లాస్ ఏంజిల్స్, జూలై 17 : హాలీవుడ్‌లోప్రసిద్ధిచెందిన ‘స్టార్‌ వార్స్‌’ సీరీస్‌తో చిత్రాలను తెరకెక్కించిన జార్జ్‌ ల్యూకాస్‌ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆటోగ్రాఫ్‌తో అభిమానులు సొమ్ము చేసుకుంటున్నారని.. ఈసారి ఎవ్వరికీ ఆటోగ్రాఫ్‌ ఇవ్వనని మండిపడ్డారు. కొందరు అభిమానులు ల్యూకాస్‌ చేసిన ఆటోగ్రాఫ్‌ను 200 డాలర్లకు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన ఆయన లాస్‌ఏంజెల్స్‌లో నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ "మీకంటే నా దగ్గర ఇంత డబ్బు ఎందుకు ఉందంటే.. నేను మీలాగా ఆటోగ్రాఫ్ లు తీసుకొని వాటిని అమ్ముకుంటూ నా సమయాన్ని వృధా చేసుకోలేదు. నా సమయాన్ని నేను సినిమాలు తీస్తూ గడిపాను. అందుకే ఈ రోజు నా వద్ద ఇంత ఆస్తి ఉంది. కాబట్టి ఇలా ఆటోగ్రాఫ్ లతో సొమ్ము చేసుకునే బదులు సొంతంగా సంపాదించండి" అంటూ ల్యూకాస్ అభిమానులకు హితబోధ చేశారు.