ఫోన్ నెంబర్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో!

SMTV Desk 2017-07-17 14:50:18  SHAARUIK KHAN, CINEMAA, TATOO, PRIVATE JET, PHONE NUMBER, MESSAGE.

ముంబై, జూలై 17 ː బాలీవుడ్‌ కింగ్‌ షారుక్‌ఖాన్‌ కి భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేసిన సెలబ్రెటీల్లో షారుక్‌ కూడా ఒకరు అనడంలో సందేహంలేదు. తాజాగా షారుక్‌.. ఆయన నటిస్తున్న ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’ చిత్ర ప్రచార కార్యక్రమం కోసం "రాజీవ్‌ మసంద్‌ టాక్‌షో"లో పాల్గొన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అనుకునే బాలీవుడ్ అభిమానులు ఎంతో మందికి షారుక్‌ సమాధానాలు ఇచ్చారు. తను ఇప్పటిదాకా ఎలాంటి టాటూలూ వేయించుకోలేదు. టాటూలంటే తనకు భయమని తాజాగా జబ్ హ్యారీ మెట్ సెజల్ సినిమా కోసం కుడి భుజం, ఛాతి మీద తాత్కాలిక టాటూలు వేయించుకున్నానని తెలిపారు. అంతేకాకుండా అంత పెద్ద స్టార్ హీరో అయిన మీకు వ్యక్తిగత జెట్ (చార్టెడ్ ఫ్లైట్) ఉండకపోవడమేంటి అని చాలా మంది అభిమానులు అడిగిన ప్రశ్నకి.. అవును నాకు ఇప్పటిదాకా వ్యక్తిగత జెట్ లేదు కానీ.. తీసుకునేందుకు మాత్రం ప్రయత్నాలు ప్రారంభించానని చెప్పారు. తన అసలు పేరు కూడా షారుక్ ఖాన్ అని తన తల్లిదండ్రులు పెట్టిన పేరు అదేనని వెల్లడించారు. ఇక, తన వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను వెల్లడించారు షారుక్. ‘‘5559960321.. ఇదే నా ఫోన్ నంబర్. అర్ధరాత్రి తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. నేను తప్పకుండా ఫోన్ ఎత్తుతాను. ఎత్తలేని పరిస్థితులుంటే.. ఓ మెసేజ్ పెట్టండి. ఓ ఎమోజీతో నేను కూడా రిప్లై ఇస్తాను’’ అంటూ సమాధానమిచ్చారు.