త్వరలో తెలంగాణ కేబినెట్ సమావేశం

SMTV Desk 2018-08-27 16:37:11  Telangana Cabinet meeting, Cm KCr

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వార్త జోరుగా షికారు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఢిల్లీలోనే పర్యటిస్తుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు అనివార్యం అనే విషయం చాల స్పష్టంగా తెలుస్తుంది . తెలంగాణ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నది . ఇది ఇలా ఉండగా రేపు కాబినెట్ సమావేశం ఉండే అవకాశం ఉందని సమాచారం . ఈ మేరకు సీఎం కెసిఆర్ ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుండి హైదరాబాద్ రానున్నారు సంబంధిత సమాచారం ఇవ్వాలని తెలంగాణ సీఎంఓ అన్ని శాఖల ముఖ్య అధికారులకు ఆదేశం చేసారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఈసీని ఒప్పించి ఎన్నికలు డిసెంబర్‌లోనే నిర్వహించేందుకు గట్టి ప్రయత్నమే చేస్తోంది