సిల్లీ ఫెలోస్ ట్రైలర్ విడుదల

SMTV Desk 2018-08-26 12:14:43  Silly fellows, Silly fellows trailer,

టాలీవుడ్ కామెడీ స్టార్స్‌ అల్లరి నరేష్‌, సునీల్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ సిల్లీ ఫెలోస్‌ అల్లరి నరేష్‌ హీరోగా సుడిగాడు లాంటి సూపర్‌ హిట్ సినిమాను తెరకెక్కించిన భీమినేని శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ సూపర్‌స్టార్‌ మహేష్ బాబు చేతుల మీద థియేట్రికల్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. అంతేకాకుండా నరేష్, సునీల్‌కు ట్విట్టర్ ద్వారా ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. ట్రైలర్ చూస్తుంటే నరేష్-సునీల్ కాంబో కడుపుబ్బా నవ్వించేలా కనిపిస్తోంది. ఇదొక కామెడీ అడ్వంచెర్‌గా కనిపిస్తోంది. జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం లాంటి హేమాహేమీలు ఈ చిత్రంలో హాస్యాన్ని పండించనున్నారు. ట్రైలర్‌లో డైలాగ్‌లు కూడా బాగా నవ్విస్తున్నాయి. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూర్ణ, చిత్ర శుక్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.