మరింత బలపడనున్న అల్పపీడనం

SMTV Desk 2017-07-17 13:30:08  VISHAAKAPATNAM, BAY OF BENGAAL, ODISSA, RAIN, ANDHRAA, RAAYALASEEMA

విశాఖపట్నం, జూలై 17 : పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఒడిశా తీరాలకు ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోందని విశాఖలోని వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందన్నారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని.. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.