గీతా ఆర్ట్స్ లో సూపర్ స్టార్

SMTV Desk 2018-08-25 12:57:02  Hyderabad, geetha Arts,mahesh Babu,

రెండు వరస పరాజయాల తరువాత మహేష్ బాబు భరత్ అనే నేనుతో మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ సినిమా విజయం తరువాత మహేష్ బాబుతో సినిమా చేసేందుకు పలువురు నిర్మాతలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు దిల్ రాజు, సి అస్వినిదత్ నిర్మాణంలో నటిస్తున్నారు. వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుంది. ఈ సినిమా తరువాత మహేష్ బాబు వన్ నేనొక్కడినే తీసిన సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తారు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మహేష్ బాబు హీరోగా నటించనున్నారనే వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మహేష్ బాబు రామ్ చరణ్ తో ఫ్రెండ్లీ గా ఉంటూ,మెగా కాంపౌండ్ కు క్లోజ్ గా ఉంటున్నారు.సో,ఈ వార్త నిజమయ్యే అవకాశం ఉంది. గీతా ఆర్ట్స్ లో ఎక్కువగా మెగా హీరోలతోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. బయట హీరోలతో సినిమాలు చేయడం చాలా తక్కువ. ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించడం శుభపరిణామం అని చెప్పొచ్చు. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఇది మల్టీస్టారర్ సినిమానా లేక మహేష్ సోలో సినిమానా అనే విషయంకూడా తెలియాలి. గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీత గోవిందం సినిమా సక్సెస్ తో మంచి స్పీడ్ మీద ఉన్నారు. హీరో వరుణ్ తేజ్ తో ఒక సినిమా నిర్మించనున్నారు. ఆసినిమా కంప్లీట్ అయిన తరువాత మహేష్ బాబు హీరో గా సినిమా నిర్మిస్తారని సమాచారం.