‘దేవదాస్‌’ టీజర్ విడుదల

SMTV Desk 2018-08-24 17:48:52  Devadas teaser, Nani, Nagarjuna

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున, నాచురల్‌ స్టార్‌ నాని కాంబినేషన్‌లో రాబోతోన్న దేవదాస్‌ ప్రత్యేకతను చాటుకుంటోంది. నాటి క్లాసికల్‌ హిట్‌ మూవీ దేవదాస్‌ టైటిల్‌తో రాబోతోన్న ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలె విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. డాన్‌గా దేవ పాత్రలో నాగార్జున, డాక్టర్‌గా దాసు పాత్రలో నాని నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్‌ చేసారు. రష్మిక మందాన్న, ఆకాంక్ష సింగ్‌లు కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాకు శ్రీరామ్‌ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.