తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా కావాలి

SMTV Desk 2018-07-26 19:22:39  Telangana, Deputy Cm kadium Srihari, Special Status

విభజన చట్టంలో పొందు పరిచిన హామీలు అమలు చేయలేదని, తెలంగాణకు న్యాయం చేయాలని కోరిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గిరిజన వర్సిటీకి భూమి ఇస్తామన్నా కేంద్రం స్పందించడం లేదని ఆరోపించారు. హైదరాబాద్‌కు ఐఐఎం ఇవ్వాలని కోరామన్నారు.వీటితో పాటు కరీంనగర్‌లో ఐఐఐటీ ఏర్పాటు చేయాలని విన్నవించామన్నారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై కడియం విమర్శలు గుప్పించారు. రాజకీయ లబ్ధి కోసమే ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం జరుగుతోందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం పట్ల తమకు ఇబ్బంది లేదన్నారు. కానీ ఏపీతో పాటే తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కడియం డిమాండ్ చేశారు.