హైదరాబాద్, జూలై 18 : తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్ ఫుల్ నిర్మాత అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు దిల్ రాజు. ఆయన తీసిన సినిమాలు ఎన్నో హిట్ టాక్ ను తెచ్చుకోవడమే కాకుండా.. మంచి కలెక్షన్లు సాధించాయి. నిర్మాణ విలువలు.. క్రెడిబిలిటీ.. జడ్జిమెంట్ స్కిల్స్.. సక్సెస్ రేట్.. ఇలా ఏ విషయంలో చూసినా ఆయన స్థాయి ఏంటో తెలుస్తుంది. తాజాగా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌లో వస్తున్న 5 సినిమాల విడుదల తేదీలను షెడ్యూలు చేశారు. ఆ వివరాలను మూవీ బజ్ అధికారిక ట్విటర్‌లో వెల్లడించారు. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో రాబోతున్న 5 మూవీల విడుదల తేదీలు.. 1) లవర్- జూలై 20, 2018, 2) శ్రీనివాసకల్యాణం- ఆగస్టు 9, 2018, 3) హలో గురూ ప్రేమకోసమే అక్టోబర్ 18, 2018, 4) ఎఫ్2- జనవరి 12, 2019, 5) ఎస్‌ఎస్‌ఎంబీ25- ఏప్రిల్ 5, 2019 గతేడాది దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఆరు చిత్రాలు విజయం సాధించాయి. ‘శతమానం భవతి’, ‘నేను లోకల్’, ‘డీజే’, ‘ఫిదా’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎంసీఏ’ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్నాయి.