ప్రముఖ నటి ప్రియాంక బలవన్మరణ౦..

SMTV Desk 2018-07-18 13:31:16  Tamil serial Vamsam actor, tv actress priyanka passed away, priyanka suicide in chennai.

చెన్నై, జూలై 18 : పలు టీవీ సీరియల్స్‌, సినిమాల్లో నటించిన యువ నటి ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడ్డారు. నేటి ఉదయం వలసరవక్కంలోని తన నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలతో పాటు సక్సెస్‌ఫుల్‌ సీరియల్స్‌లో నటించిన ప్రియాంక.. విగతజీవిగా కనిపించే సరికి షాక్ తిన్న పనిమనిషి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ప్రియాంక ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు. గత మూడు నెలలుగా ప్రియాంక తన భర్తకు దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంట్లో గొడవల కారణంగానే ప్రియాంక ఈ నిర్ణయం తీసుకున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.