కత్తి మహేష్ నోట.. శ్రీ రాముని పాట..

SMTV Desk 2018-07-12 17:49:15  kathi mahesh, kathi mahesh sing god song, hyderabad, social media viral

హైదరాబాద్, జూలై 12 : హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ క్రిటిక్ కత్తి మహేష్ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కత్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్‌ చేయడంతో కత్తిపై హైదరాబాద్‌ పోలీసులు ఆరునెలలు నగర బహిష్కరణ వేటు వేశారు. పోలీసుల అనుమతి లేకుండా హైదరాబాద్‌లో అడుగుపెట్టడానికి వీళ్లేదని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కత్తి దీనిపై న్యాయబద్ధంగా పోరాడటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా శ్రీరాముడిని దూషించిన నోటితోటే ఆయనను పొగుడుతూ శ్లోకాలతో కూడిన ఓ పాటను కత్తి మహేష్‌ పాడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కత్తి మహేష్‌ రాముడి పాటను స్పష్టంగా పాడుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాదాపు ఒక నిమిషం పాటు ఉన్న ఈ వీడియోలో ఆయన నోటి వెంట రాముని పాట తప్ప ఇంకేమీ లేకపోవడం విశేషం. అయితే కత్తి నోట ఈ శ్లోకం రావడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. పశ్చత్తాపంతో రాముడిని స్మరించుకున్నాడా..? లేదంటే శ్రీ రాముడికి తాను వ్యతిరేకిని కాదని చెప్పడానికి పాడాడా..? భయంతో పాడుతున్నాడా.? భక్తితో పాడుతున్నాడా.? లేక వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నారా.? అనేది తెలియడం లేదు.