ఎన్టీఆర్‌, రాజమౌళి కలయికలో మరో చిత్రం...

SMTV Desk 2017-07-15 15:29:33  RAJAMOULI, NTR, TRIVIKRAN, MOVIE, JAI LAVAKUSHA, COMBINATION.

హైదరాబాద్, జూలై 15 : టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి సినీ ప్రయాణం ఎన్టీఆర్‌ "స్డూడెంట్‌ నెం.1" సినిమాతోనే మొదలైంది. సూపర్‌ హిట్ కాంబినేషన్లలో ఎన్టీఆర్‌ - రాజమౌళిలది ఒకటి. వీరిద్దరూ ‘స్డూడెంట్‌ నెం.1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’లతో హ్యాట్రిక్‌ కొట్టేశారు. యమదొంగ విడుదలై అప్పుడే ఏడేళ్లయిపోయింది. అప్పటి నుంచి ఎన్టీఆర్‌- రాజమౌళి కలిసి మరో సినిమా చేయలేదు. కాని ఇప్పుడు అందుకు ముహూర్తం కుదిరిందని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ‘బాహుబలి’ తరువాత రాజమౌళి తీయబోయే సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ తోనే అని టాలీవుడ్ టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్‌ లవకుశ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉండగా ఆ సినిమా పూర్తయ్యాకే రాజమౌళి - ఎన్టీఆర్‌ల కాంబినేషన్ ఉంటుందా? లేదంటే ‘లవకుశ’ అవ్వగానే మొదలుపెడతారా? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు.