కత్రినా పై అర్జున్ కపూర్ సెటైర్..

SMTV Desk 2018-07-07 17:19:06  katreena kaif, arjun kapoor, instagram chat goes viral.

హైదరాబాద్, జూలై 7 : బాలీవుడ్ లో ఒకప్పుడు ఐరన్‌ లెగ్‌గా పేరు తెచ్చుకున్న కత్రినా కైఫ్.. ఆ తరువాత వరుస విజయాలతో సత్తా చాటారు. ఈమె సినిమాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అగ్ర కథానాయికలలో ఒకరిగా కొనసాగుతున్న కత్రినా.. ఇటీవల సల్మాన్ ఖాన్ సరసన "టైగర్ జిందాహై" సినిమాతో నటించింది. ఈ చిత్ర౦ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో బ్లాక్ డ్రెస్ వేసుకొని బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ తో ఫోజులిస్తున్న ఓ వీడియోను షేర్ చేసింది. ఈ పొస్ట్‌పై బాలీవుడ్ యువ హీరో అర్జున్‌ కపూర్‌.. కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు అర్జున్ కపూర్.. "కత్రినా.. నీకు డాండ్రఫ్ ఉందా.? అని అడిగాడు. దానికి వెంటనే కత్రినా బదులిస్తూ.. "బాధపడకు.. నాకు తెలుసు నీకు కూడా ఇలా ట్రై చేయాలనిపిస్తోందని.. మనిద్దరం కలిసి చేద్దా౦" అంటూ అర్జున్ కపూర్ కు సెటైర్ వేసింది. ఇలా ఇద్దరి మధ్య సరదాగా సాగిన కామెంట్స్ నెటిజన్లను ఎంతగానో ఆకర్షించాయి.