వైరల్ : పవన్ చిన్ననాటి ఫోటో చూశారా..!

SMTV Desk 2018-07-06 11:09:26  pawan kalyan newpic goes viral,social media, power star pawan kalyan.

హైదరాబాద్, జూలై 6 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చిన్ననాటి ఫోటోను పవన్ పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత నాగబాబు సహా వారి అక్క మాధవీరావు, చెల్లెలు విజయదుర్గ ఉన్నారు. ఈ ఫోటో గురించి పవన్ వివరిస్తూ.. నెల్లూరులో తీసుకున్న ఫొటో అని, అప్పుడు తాను ఏడో తరగతి చదువుతున్నాని పేర్కొన్నారు. అంతేకాకుండా తను అప్పుడు ఒక వ్యాధితో బాధపడుతున్నాదట. బ్రాంకైటిస్(శ్వాసనాళము వాపు వ్యాధి)తో బాధపడుతూ కోలుకుంటున్న సమయంలో తీసుకున్న ఫొటో అంటూ వివరించారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పవన్ అభిమానులు ఈ ఫొటోను రీట్వీట్ చేస్తూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల రాజకీయరంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం.. విశాఖలో పర్యటిస్తూ తన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.