హైదరాబాద్ లో పర్యటించనున్న ఉపరాష్ట్రపతి..

SMTV Desk 2018-07-02 14:17:23  venkaiah naidu, vice president, traffic rules.

హైదరాబాద్, జూలై 2 : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నెల 2 నుంచి 5 వరకు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన నిమిత్తం ఆయా రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 10.35 నుంచి 11.15 గంటల వరకు బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి సోమాజిగూడ, ఏషియన్ గ్రాస్ట్రో ఎంట్రాలజీ రూట్. 11.45 నుంచి 12.25 గంటల వరకు ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ నుంచి రోడ్డునెం. 12, బంజారాహిల్స్‌లోని ఆయన నివాసం వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. * మంగళవారం ఉదయం 6.35 నుంచి 7.10 గంటల వరకు బంజారాహిల్స్ నుంచి ఎల్వీప్రసాద్ కంటి దవాఖాన వరకు, 11.45 నుంచి 12.45 వరకు సంతోష్‌నగర్ నుంచి బంజారాహిల్స్. సాయంత్రం 5.20 నుంచి 6.05 వరకు బంజారాహిల్స్ నుంచి రవీంధ్రభారతి, 7.15 నుంచి 8 గంటల వరకు రవీంధ్రభారతి నుంచి బంజారాహిల్స్ వరకు ఉండనుంది. * బుధవారం ఉదయం 9.35 నుంచి 10.35 గంటల వరకు బంజారాహిల్స్‌లోని నివాసం నుంచి నిజాంపేట్ వరకు. 11.45 నుంచి 12.45 వరకు నిజాంపేట్ నుంచి ఆయన బంజారాహిల్స్‌లోని నివాసం వరకు. * గురువారం ఉదయం 6 నుంచి 6.30 గంటల వరకు బంజారాహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్టు వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ వెల్లడించారు.