కాంగ్రెస్ ది మోసాల చరిత్ర..

SMTV Desk 2018-07-02 13:35:23  ktr, it minister, tpss president uttam kumarreddy.

హైదరాబాద్, జూలై 2 : తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ది మోసాల చరిత్ర అని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ ను స్వీకరించానని.. ఆయన మాట నిలబెట్టుకున్నా, నిలబెట్టుకోక పోయినా, తాను మాత్రం మాటపై నిలబడతానన్నారు. తెలంగాణను ఇచ్చింది అమ్మా కాదు, బొమ్మా కాదు అంటూ చేసిన వ్యాఖ్యలను ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుబట్టడంపై కేటీఆర్ స్పందించారు. ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నది తెలంగాణ ప్రజలేనని, విధిలేని పరిస్థితుల్లోనే ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణను ఇచ్చిందని చెప్పుకొచ్చారు. అందుకే తానూ అలా వ్యాఖ్యానించానని వెల్లడించారు.