వైరల్ : పులితో నవదీప్ సెల్ఫీ..

SMTV Desk 2018-07-01 14:25:15   navadeep selfee with tiger, hero navadeep, social media, instagram pic goes viral,

హైదరాబాద్, జూలై 1 : యువ కథానాయకుడు నవదీప్ నిత్యం సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటారు. తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు సామాజిక అంశాలపై కూడా నవదీప్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టులు చేస్తుంటాడు. ఇటీవల తన లైఫ్ సరైన దిశలో పయనించడం లేదనే క్యాప్షన్ తో ఆయన పోస్ట్ చేసిన హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్ ఫొటో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అదే తరహాలో ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో మరో పోస్ట్ పెట్టాడు. ఓ అడవిలోకి వెళ్లిన నవదీప్, అక్కడ ఉన్న పెద్దపులితో సెల్ఫీ దిగాడు. దీనికి "ఏరా పులీ..." అన్న కామెంట్ ని జోడించి, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ ఫొటోను ఎప్పుడు, ఎక్కడ తీసుకున్నానన్న విషయాన్ని మాత్రం నవదీప్ వెల్లడించలేదు. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు నవదీప్ పై రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఆ ఫొటో ఎక్కడ తీశారు.? పులితో ఏం చేస్తున్నారు.? అంటూ ప్రశ్నిస్తున్నారు.