మేలుచేసే ఇలాచీ...

SMTV Desk 2017-07-14 11:18:04  Ilaci, Magnesium, calcium, Electrolytes

హైదరాబాద్, జూలై 14 : ఉదయాన్నే తాగే చాయ్ నుంచి వండుకునే పదార్థాల వరకు ఇలాచీ (యాలకులు)ఉపయోగాలు .... వంటలు రుచిగా అవ్వడానికి ఇలాచీని ఉపయోగిస్తే చాలు, రుచితో పాటుగా ఆరోగ్యానికి కూడా గొప్ప మేలు జరుగుతుంది. ఈ యాలకుల్లో మెగ్నీషియం, కాల్షియంతో పాటు కావలసినన్ని ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. దీనిని తీసుకోవడం ద్వారా పొటాషియం గుండె కొట్టుకునే వేగాన్ని క్రమబద్దీకరిస్తుంది. తద్వారా అధిక రక్తపోటుని అదుపు చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలను యాలకులు తగ్గిస్తాయి. యాలకులతో చేసిన నూనె ఆప్లై చేయడం వల్ల పెదాలు ఆరోగ్యంగా ఉంటాయి. అదే విధంగా పెస్ట్ చేసి ముఖానికి రాయడం ద్వారా చర్మం మరింత కాంతివంతంగా కనిపిస్తుంది. రోజుకు రెండు యాలకులు తినడం ద్వారా ఆకలి పెరుగుతుంది. అలానే పడుకునే ముందు గ్లాస్ పాలల్లో యాలకుల పొడి కలిపి తాగితే రక్తహీనత తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో వేధించే గొంతు సమస్యలు అధికంగా చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్తతో యాలకులు ఉపయోగించడం ఉత్తమం. శరీర అవయవాలలో భాగమైన శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ యాలకులు పని చేస్తాయి.. ఎన్నో రకాలుగా ఈ ఇలాచీ మానవ మనుగడకు ఉపయోగపడుతుంది.