విజయ్ దేవరకొండకు కేటీఆర్ సర్ ప్రైజ్..!!

SMTV Desk 2018-06-25 11:07:46  vijay devarakonda, minister ktr, ktr visited vijay home.

హైదరాబాద్, జూన్ 24 : టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండకు తెలంగాణ మంత్రి కేటీఆర్ సర్ ప్రైజ్ ఇచ్చారు. నిన్న సాయంత్ర హైదరాబాదులోని విజయ్ ఇంటికి ఆయన.. అయన కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఈ విషయాన్ని విజయ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. "మీ ఇంటికి మీ ఇష్టమైన నాయకుడు లంచ్‌కు వస్తే..? ఒక్క సెకన్.. అసలేం జరుగుతోంది బాస్. ఏదైనా జరగొచ్చు. మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోవాలంతే..." అంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా "నా ఫిల్మ్ ఫేర్ అవార్డును కేటీఆర్ కు చూపించా. వేలం గురించి చర్చించా. కేటీఆర్ నాకు చేనేత, నీటి పరిరక్షణ, హైదరాబాద్ రోడ్లను తవ్వుతుండటం, చరిత్ర, విజయపథంలో ఉండటం గురించి వివరించారు. అలాగే అతని తండ్రి, బాస్, కుమారుల గురించి మాట్లాడుకున్నాం" అంటూ ట్వీట్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుత౦ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.