కాబోయే భర్త మెసేజీలు చదివే ప్రైవసీ లేదు..

SMTV Desk 2018-06-22 11:16:25  renu desai, twitter post goes viral, renu desai marriage.

హైదరాబాద్, జూన్ 22 : ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ త్వ‌ర‌లో మ‌రో వ్య‌క్తితో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నట్లు చెప్పకనే చెప్పింది. ఇటీవల తనకు జీవిత భాగస్వామి దొరికినట్లు ఓ వ్యక్తి చేయిపట్టుకుని దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రేణు త‌న పిల్ల‌లు, స్నేహితుల‌తో కలిసి విహార యాత్ర కోసం గోవా వెళ్లారు. అక్క‌డ స్విమ్ సూట్‌లో తీయించుకున్న ఫోటోను రేణు షేర్ చేశారు. అయితే తన స్నేహితులు తనకు కాబోయే భర్త చేసే మెసేజ్‌లు చదివే ప్రైవసీని ఇవ్వడంలేదట. ఈ విషయాన్ని స్వయంగా రేణూ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడిస్తూ.. "ఈ ఫోటోను నా స్నేహితులు తీశారు. ఆ స‌మ‌యంలో నా కాబోయే భ‌ర్త పంపిన మెసేజ్‌ల‌ను చ‌దువుతున్నాను. అలాంటి స‌మ‌యాల్లో కూడా ఫోటోలు తీస్తూ నా స్నేహితులు నాకు ప్రైవ‌సీ ఇవ్వ‌డం లేదు" అంటూ పేర్కొన్నారు. ఈ పోస్టు చూసిన వారంతా రేణూ వివాహం త్వరలోనే జరగబోనుందని వార్తలు వస్తున్నాయి.