ఆ విషయంలో అభయ్ ని కాపాడలేకపోయా..

SMTV Desk 2018-06-10 13:31:42  JUNIOR NTR, NTR SON ABHAY RAM, NTR TWITTER PIC GOES VIRAL.

హైదరాబాద్, జూన్ 10 : జూనియర్ ఎన్టీఆర్ నిత్యం సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబానికి సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా అభయ్ కి పెద్ద కష్టం వచ్చి పడింది. అభయ్ తో తల్లి లక్ష్మీ ప్రణతి బలవంతంగా పాలు తాగిస్తున్నారు. తనకు ఇష్టం లేకపోయినా.. ప్రణతి కోపంగా చూస్తూ అభయ్ పాలు తాగేంత వరకు అక్కడి నుండి కదిలేది లేదని అభయ్ పక్కనే నిలబడి ఉంది. ఈ ఘటన అంతా ఎన్టీఆర్ కాళ్ల ముందే జరుగుతున్నా తన కొడుకు గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఈ సందర్భంగా ఎన్టీఆర్.. తమ చిన్నారి అభయ్ రామ్, భార్య ప్రణతి కలిసి ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేసి ఆసక్తికర ట్వీట్ చేశారు. "వాడు తాగాల్సిన కోటా పాలకు సంబంధించి అభయ్ ను వాళ్లమ్మ నుంచి కాపాడలేం" అంటూ సరదా వ్యాఖ్య జోడించాడు. చాలా క్యూట్ గా.. ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ ట్వీట్ కు ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిషోర్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు. "క్యూట్ నెస్‌ ఓవర్ లోడెడ్" అంటూ చిన్నారి అభయ్ కి కితాబిచ్చాడు.