గడ్కరీకి హరీశ్‌ కృతజ్ఞతలు..

SMTV Desk 2018-06-06 18:50:31  kaleshvaram project, cm kcr, minister harishn rao, nithin gadkari.

హైదరాబాద్, జూన్ 6 : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తెలంగాణ సర్కార్ మరో ముందడుగు వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల శాఖ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు ఇచ్చింది. ఢిల్లీలో జరిగిన సమావేశంలో టీఏసీ అనుమతిస్తూ ఈ నిర్ణయం ప్రకటించింది. టీఏసీ అనుమతులను జారీ చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్న విషయం విదితమే. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం కానుంది. అయితే సీడబ్ల్యూసీ నుంచి అన్ని అనుమతులు పొందిన ఏకైక భారీ ప్రాజెక్టుగా కాళేశ్వరం రికార్డు నెలకొల్పడం విశేషం.