మెగా డాటర్ బైక్ రైడ్ అదిరిందిగా..

SMTV Desk 2018-06-05 11:53:11  niharika konidela, bike riding pic, na peru surya shooting break time.

హైదరాబాద్, జూన్ 5 : మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలు ఎవరి స్టైల్లో వారు తమ సత్తా చూపిస్తున్నారు. ఒకరితో ఒకరికి పోలిక లేకుండా తమ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకొని సినిమాల్లో రాణిస్తున్నారు. వీరంతా ఒకవైపు ఉంటే.. మెగా డాటర్ నిహారిక తనదైన శైలిలో తెరపైకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది. వెబ్ సిరిస్ లతో బుల్లితెరపైకి అడుగుపెట్టి.. ఒక మనసుతో వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత అవకాశాలు అంతగా రాకపోయినా.. లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకొని జపాన్ లో విహారి౦చారు. ప్రస్తుతం సినిమాలకు కాస్తంత గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు.. అల్లు అర్జున్ "నా పేరు సూర్య" సినిమా షూటింగ్ సమయంలో సెట్ కి వెళ్లి బాగానే ఎంజాయ్ చేసిందట. పైగా ఈ సినిమాకు నాగబాబు సహా నిర్మాత కావడంతో కాస్తంత పనుల్లో కూడా సాయపడినట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ విరామ సమయంలో నిహారిక ఓ బైక్ ఏసుకొని చక్కర్లు కొట్టేసింది. ఇంతకు నిహారికకు బైక్ డ్రైవ్ చేయడం కొత్తేం కాదు. ముందు నుంచి అలవాటే ఉందట. బైక్ నడపడంలో అమ్మాయిలూ తక్కువ కాదని స్టైలిష్ బైక్ నడుపుతూ దిగిన అప్పటి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకి నెటిజన్స్ నుంచి రెస్పాన్స్ బాగానే వస్తోంది.