ఫిలిం స్కూల్ ప్రారంభించనున్న ఆర్జీవీ..

SMTV Desk 2018-05-27 12:26:20  ram gopal varma, acting school, rgv unschool.

హైదరాబాద్, మే 27 : వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తనకు అనిపించి౦ది ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం కలవాడు. తాజాగా వర్మ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. సినిమాల్లో రాణించాలని కుతూహలం ఉన్న యువతి, యువకులకు సహాయపడి, వారికి కావాల్సిన శిక్షణ ఇచ్చేలా వర్మ ఫిల్మ్ స్కూల్ ను ప్రారంభించనున్నట్టు ప్రకటించనున్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించిన వర్మ.. నూతన టెక్నాలజీతో పాటు, డిఫరెంట్ మేకింగ్ ను నేర్పిస్తామన్నారు. న్యూయార్క్ కు చెందిన డాక్టర్ రామ్ స్వరూప్, డాక్టర్ శ్వేతా రెడ్డిల సహకారంతో ఈ స్కూల్ ను ప్రారంభిస్తానని పేర్కొన్నారు. ఈ స్కూల్ కు "ఆర్జీవీ అన్ స్కూల్" అని పేరు పెట్టానని వెల్లడించారు. ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలను నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు.