పూనమ్ ట్వీట్స్ లో ఆ అజ్ఞాత‌ డైరెక్టర్ ఎవరు..?

SMTV Desk 2018-05-25 12:55:30  PoonamKaur, Twitter account, director counters.

హైదరాబాద్, మే 25 : ప్రముఖ నటి పూనమ్ కౌర్.. గత కొద్ది కాలంగా ట్విట్టర్ లో వరుస ట్వీట్లతో ముంచెత్తుతుంది. పరోక్షంగా ఓ దర్శకుడిని ఉద్దేశిస్తూ ఆమె చేసే ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ దర్శకుడెవరో బయటపెట్టకపోయినప్పటికీ ఆయన సినిమాలను ప్రస్తావిస్తూ చెప్పడం హాట్ టాపిక్ అయింది. ఈ మేరకు పూనమ్ తన ట్విట్టర్ ఖాతాలో.. "త‌ను మ‌ద్ద‌తుగా నిలిచే నాలుగు కుటుంబాల ద్వారా ఓ ఎన్నారై హీరోయిన్‌కు అవ‌కాశాలు వ‌చ్చేలా చూస్తుంటాడు ఓ దర్శకుడు. నాకు హిట్‌లు లేవు. మ‌రి, ఆమెకు హిట్‌లు ఉన్నాయా? ఎన్నారై హీరోయిన్లు మీరు చెప్పిన ప‌నులు బాగా చేస్తార‌ని విన్నాను. జ‌ల్సాలు చూపిస్తూ.. అజ్ఞాత‌వాసంలో వేసెస్తాడు జాగ్ర‌త్త‌.. న‌మ్మ‌క‌ద్రోహి. మంచికి విలువ ఇస్తే.. చెడు జ‌రిగేది కాదు. గాడ్ బ్ల‌స్ యూ ఆల్‌" అంటూ వరుస ట్వీట్స్ చేసింది. దీంతో ఆ డైరెక్టర్ ఎవరా అంటూ ఆలోచనలో పడ్డారు నెటిజన్లు.