ఇంట్లోనే 3 నెలలుగా శవం

SMTV Desk 2017-07-10 12:21:45  Corpse for 3 months at home

మల్లాప్పురం, జూలై 10: కేరళలో వి. సయేద్ అనే వ్యక్తి స్థానికంగా ఉంటూ, మత ప్రభోధకుడిగా పనిచేస్తున్నాడు. అకస్మాత్తుగా చనిపోవడంతో సయేద్‌ కుటుంబసభ్యులు ఎప్పుడు చుట్టుపక్కల వారితో ఎక్కువగా మాట్లాడేవారు కారని స్థానికులు చెబుతున్నారు. ఇంటి పెద్ద తిరిగి వస్తాడని నమ్మకంతో శవాన్ని మూడు నెలలుగా ఇంట్లోనే పెట్టి ప్రార్ధనలు చేశారు. చట్టు పక్కల ఉండే వారికి దుర్వాసన రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని బలవంతగా గది తలుపులను తెరిచారు. చనిపోయిన సయేద్ చుట్టూ ఆయన భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె కూర్చుని ప్రార్థన చేస్తూ కనిపించారు. శవం పూర్తిగా కుళ్లిపోయి కేవలం ఎముకలు మాత్రమే మిగిలాయి. శవాన్నిపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సాయేద్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.