రాయల్ రిసెప్షన్‌లో అదుర్స్ అనిపిస్తున్న ప్రియాంక...

SMTV Desk 2018-05-20 17:35:14  priyanka chopra, prince hyaree, meghan merkel.

ముంబై, మే 20 : క్వీన్‌ ఎలిజబెత్‌ మహారాణి మనవడు ప్రిన్స్‌ హ్యారీ, అమెరికా నటి మేఘన్‌ మెర్కెల్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాహా వేడుకకు బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హాజరయ్యారు. తాజాగా ప్రిన్స్‌ హ్యారీ దంపతుల రిసెప్షన్ నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రియాంక బంగారు వర్ణం గౌనులో తళుక్కుమన్నారు. ఈ సందర్భంగా ఆమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల వీరి పెళ్లిలోనూ ప్రియాంక రాయల్ లుక్ తో సందడి చేశారు. వీరి వివాహం సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. అంతేకాకుండా "ప్రియమైన నా స్నేహితురాలా.. నువ్వు ప్రేమకు, అందానికి నిలువెత్తు నిదర్శనం. ఈ పెళ్లి చేసుకోవాలని మీరు తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. మార్పు, ఆశ అనే రెండు అంశాలు ఈ ప్రపంచానికి ఎంతో అవసరం. మీ ఇద్దరు వివాహ బంధంతో ఒకటి కావడం చూసి చాలా సంతోషించా. మీ ఇద్దరు సంతోషంగా జీవిస్తారని ఆశిస్తున్నా" అని ఆమె పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.