రాయల్ వెడ్డింగ్ లో మెరిసిన ప్రియాంక..

SMTV Desk 2018-05-19 17:21:06  prince harry wedding, priyanka chopra, landan.

ముంబై, మే 19 : లండన్‌ సమీపంలోని విండ్సర్‌ క్యాసిల్‌లో గల చర్చిలో క్వీన్‌ ఎలిజబెత్‌ మహారాణి మనవడు ప్రిన్స్‌ హ్యారీ, అమెరికా నటి మేఘన్‌ మెర్కెల్‌ల వివాహం ఘనంగా జరుగుతోంది. ప్రియాంక, మేఘన్‌ గత కొన్నేళ్లుగా స్నేహితులు. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వేడుకకు బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హాజరయ్యారు. ఆమెతోపాటు మేఘన్‌ స్నేహితులు కూడా పెళ్లికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ పెళ్లి వేడుకలో తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియాంక తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కాగా ప్రియాంక ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. తన స్నేహితురాలు మేఘన్‌ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారని.. ఈ వివాహం వారి జీవితాల్లో మరింత ఆనందాన్ని నింపబోతోందని పేర్కొన్నారు.