ట్రెండి౦గ్ లో జెమిని గణేషన్ కుమార్తెల ఫోటో..!!

SMTV Desk 2018-05-19 15:16:45  GEMINI GANESHAN, GEMINI GANESHAN DAUGHTERS, RARE PIC GEMINI DAUGHTERS.

హైదరాబాద్, మే 19 : మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం "మహానటి". ఈ చిత్రంపై అభిమానులు, సినీ ప్రముఖులు అద్భుతమైన చిత్రం అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం మే 9న విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తుంది. తొలి షో నుంచే సూపర్‌ హిట్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ఓవర్‌ సీస్‌లో కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో నెటిజన్లు జెమినీ గణేశన్ పిల్లలు ఎవరెవరు అనే దానిపై ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతోంది. జెమినీ గణేషన్ కు ముగ్గురు భార్యలు ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు మొత్తంగా ఏడుగురు కుమార్తెలు. ఒక కుమారుడు. మూడవ భార్య అయిన సావిత్రికి ఒక కొడుకు(సతీష్), కుమార్తె(విజయ చాముండేశ్వరి) ఉన్నారు. రెండవ భార్య పుష్పవల్లికి ఇద్దరు కుమార్తెలు కాగా.. అందులో బాలీవుడ్ నటి రేఖ ఒకరు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటోలో జెమినీ గణేశన్ కుమార్తెలందరు ఉన్నారు. కమలా సెల్వరాజ్, రేఖ, రేవతి, నారాయణి, జయ శ్రీధర్, విజయ చాముండేశ్వరి, రాధ వీరంతా కలిసి ఉన్నారు. ఈ ఫోటో చూస్తే వీరందరి మధ్య మంచి సఖ్యత ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో ట్రెండి౦గ్ ఉంది.