తమన్నాకు రెండు కోట్లా..?

SMTV Desk 2018-05-18 17:32:57  tamanna, na nuvve movie, kalyan ram hero, tamanna remuneration.

హైదరాబాద్, మే 18 : మిల్కీ బ్యూటీ తమన్నా.. "బాహుబలి" ప్రాజెక్ట్ తర్వాత అంత పెద్ద ప్రాజెక్టులను చేజిక్కించుకోలేక పోయింది. అయిన్నప్పటికీ ఈ అమ్మడుకి క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ తమ డిమాండ్స్ ను బట్టి ఆయా సినిమాలకు పెద్ద మొత్తంలోనే పారితోషకం డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తమన్నా.. కళ్యాణ్ రామ్ తో "నా నువ్వే" అంటూ ఓ డిఫరెంట్ రొమాంటిక్ చిత్రం చేస్తుంది. అయితే ఈ సినిమా కోసం తమ్ము డార్లింగ్ కు పెద్ద మొత్తంలోనే పారితోషకం ముట్టిందట. ఏకంగా కోటి ఎనభై లక్షల రూపాయల పారితోషికం అందుకుందట. అంటే దాదాపుగా ఓ ఇరవై తక్కువ రెండు కోట్ల రూపాయలు. ఈ చిత్రానికి జయేంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు తమన్నా అయితేనే కరెక్ట్ గా సరిపోతుందనే ఉద్దేశంతో దర్శకుడు.. నిర్మాతలను ఒప్పించి మరి తమ్ము అడిగినంత ఇప్పించారట. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.