తమిళంలో 25న రానున్న "భరత్"..

SMTV Desk 2018-05-17 13:20:31  mahesh babu, bharath ane nenu, tamil release, bharath yenam naan

హైదరాబాద్, మే 17 : ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన "భరత్ అనే నేను" చిత్రం ప్రేక్షకాధారణ పొందిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఈ సినిమా తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. చెన్నైలో దాదాపు 20పైగా థియేటర్లలో ఈ సినిమాను తెలుగులోనే రిలీజ్ చేశారు. అయినప్పటికీ ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రాన్ని తమిళంలోకి అనువదించి తమిళంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. "భరత్‌ ఎనుం నాన్‌" అనే పేరుతో ఈనెల 25వ తేదీన చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్ వెల్లడించనుంది.