కేన్స్ లో మెరిసిన సోనమ్‌..

SMTV Desk 2018-05-15 14:44:38  CANNES INTERNATIONAL FILM FESTIVAL, SONAM KAPOOR

హైదరాబాద్, మే 15 : 71వ కేన్స్‌ చిత్రోత్సవాలు సందడిగా సాగుతున్నాయి. ఈ వేడుకలో ఇప్పటికే దీపికా పదుకొనే, ఐశ్వర్య రాయ్, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రాలు వైవిధ్యమైన దుస్తుల్లో మెరిసిపోయారు. తమ అందాల ప్రదర్శనతో కనువిందు చేశారు. తాజాగా ఈ అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేడుకకు ప్రముఖ నటి సోనమ్‌ కపూర్‌ హాజరయ్యారు. ఇటీవల ఈ ముద్దుగుమ్మ ఆనంద్ అహుజా ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో సోనమ్‌ ఈ వేడుకకు హాజరు కాలేదేమో అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. కాని అందరి అనుమానాలను తారుమారు చేస్తూ.. సోనమ్‌ తన భర్తతో కలిసి ఫ్రాన్స్ చేరుకొని ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రముఖ ఆస్ట్రేలియన్‌ డిజైనర్లు రాల్ఫ్ అండ్‌ రూస్సో డిజైన్‌ చేసిన ఆఫ్‌ వైట్‌ లెహెంగాలో సోనమ్‌.. మెరిసిపోయారు. అంతేకాకుండా జుట్టు అల్లుకుని జడకుచ్చులు పెట్టుకోవడంతో అందరి దృష్టి ఒక్కసారిగా తనవైపుకు తిరిగింది. ఈ కేన్స్ వేడుక అనంతరం సోనమ్‌.. తన భర్తతో కలిసి కొన్ని రోజులు ప్రాన్స్ లోనే గడపనుంది.