బందీగా మల్లికా శెరావత్‌..!

SMTV Desk 2018-05-15 11:35:06  allika sheravath, cannes international film festival, free girl ngo.

ఫ్రాన్స్, మే 15 : 71 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకలో బాలికల రక్షణకై నటి మల్లికా శెరావత్‌ వినూత్న ప్రచారం నిర్వహించారు. బాలికల రక్షణకై "ఫ్రీ గర్ల్‌" అనే ఎన్జీవో తరఫున మల్లికా కేన్స్‌లో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తనను తాను ఒక బోనులోకి దూరి బందీని చేసుకున్నారు. ఈ సందర్భంగా మల్లికా మీడియాతో మాట్లాడుతూ.. నేను కేన్స్ లో పాల్గొనడం నాకు ఇది తొమ్మిదవ సారి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆకృత్యాలపై అవగాహన కల్పించేందుకు ఇదొక మంచి అవకాశం. ఎంతో మంది అమాయక చిన్నారులు సాయం చేసేవారు లేక బతుకీడుస్తున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా "ఈ రోజుల్లో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు నా వంతుగా ఏదైనా చేయాలనుకున్నా. అందుకే ఇలా "ఫ్రీ గర్ల్‌" అనే ఎన్జీవో తరఫున ప్రచారం చేస్తూ.. ఎన్నో అవగాహన కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.