"మహానటి" శాటిలైట్ రైట్స్ 10 కోట్లు..!!!

SMTV Desk 2018-05-10 15:33:04  mahanti movie, satellite rights, nag ashvin director.

హైదరాబాద్, మే 10 : నాగ్ అశ్విన్.. దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధానపాత్ర పోషించిన చిత్రం "మహానటి". ఈ సినిమాలో నటీనటులు ఎంతో చక్కగా ఒదిగిపోయి నటించారు. ఈ సినిమా విడుదలైన 24 గంటల్లో ప్రేక్షకాభిమాన లోకం నీరాజనాలు పలికారు. నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చిత్రానికి ఎంతటి క్రేజ్ ఉందంటే.. అగ్ర దర్శకులు సహా ప్రతి ఒక్కరు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో కొన్ని ఛానల్స్ శాటిలైట్ రైట్స్ కోసం పోటీపడటం మొదలెట్టాయట. ఇక ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ చూసిన ఒక ఛానల్.. 10 కోట్లు చెల్లించి శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్టుగా సమాచారం.