టాక్సీవాలా టీజర్..!! హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ

SMTV Desk 2018-05-09 17:30:10  taxiwala teaser, vijay devarakonda, happy birthday vijay devarakonda.

హైదరాబాద్, మే 9 : యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న చిత్రం టాక్సీవాలా. ఈ రోజు విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ "టాక్సీవాలా" టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ లో విజయ్ చాలా స్టైలిష్ గా దర్శనమిచ్చాడు. వెనకాల వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. "హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ.. టీమ్ టాక్సీవాలా" అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా విజయ్ దేవరకొండ నటించిన "మహానటి" చిత్రం ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన నాటి నుండి ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ దూసుకెళ్తోంది.