సావిత్రి బయోపిక్ ను నిజాయితీతో తీశా..

SMTV Desk 2018-05-08 15:12:02  mahanati movie, director nag asvin, savitri biopic.

హైదరాబాద్, మే 8: ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్.. సావిత్రి జీవితకథ ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన చిత్రం "మహానటి". కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని ప్రియాంక దత్, స్వప్న దత్ లు నిర్మించారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించారు. ఈ చిత్రం మే 9 న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా నాగ్‌అశ్విన్‌ మాట్లాడుతూ.. "సావిత్రి గురించి తెలియని వారు లేరు. ఇప్పటికే ఆమె జీవితం గురించి నాలుగురైదుగురు పుస్తకాలు రాశారు. ఈ పుస్తకాల్లో బోల్డన్ని విషయాలు ఉన్నాయి. అందుకని నేనేమీ ఎక్కువ రీసెర్చ్‌ చేయలేదు. సావిత్రి కుటుంబ సభ్యులు, చిన్ననాటి స్నేహితులను కలిశా. ప్రేక్షకులకు ఎవరికీ తెలియని అంశాలు సేకరించి స్ర్కిప్ట్‌ సిద్ధం చేశానన్నారు". అలాగే "ఆమె జీవితాన్ని మొత్తం సినిమాగా తీస్తే మొత్తంగా ఆరు, ఏడు సినిమాలవుతాయి. అందుకని సినిమాను అదంతా కలిపి ఒక్క సినిమాగా ఎడిట్ చేశా. సావిత్రి వ్యక్తిగత జీవితాన్ని, సినిమా లైఫ్ ను సమాంతరంగా నడిపించా. ఆమె జీవితాన్ని నిజాయితీతో తీశా. జెమినీ గణేశన్ తో సహా. ఈ చిత్రంలో నటించిన నటీనటులంతా పాత్ర.. పెద్దదా, చిన్నదా.. అనే తేడా లేకుండా కేవలం సావిత్రి సినిమా అనే ఇందులో నటించడానికి ఒప్పుకున్నారు" అంటూ చెప్పుకొచ్చారు.