రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరో

SMTV Desk 2018-05-06 16:31:06  ALLU ARJUN, ALLU FANS, 10 LAKHS CHECK.

హైదరాబాద్, మే 6 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నాడు. బన్నికి తన అభిమానులంటే ఎంతో మమకారం. దీనికి ఉదాహరణ ఈ సంఘటన. తీవ్ర అనారోగ్యం బారినపడిన అభిమానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇంతకి విషయమేమిటంటే.. విశాఖ జిల్లా అనకాపల్లి కస్పావీధికి చెందిన మాటూరు దేవసాయిగణేశ్‌ బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. తనకు అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టమట. అల్లు అర్జున్‌ను చూడాలని, అదే తన చివరి కోరిక అని వైద్యులకి చెప్పాడట సాయిగణేష్. ఈ విషయం తెలుసుకున్న బన్ని అతనిని పరామర్శించడానికి అక్కడకు వెళ్ళాడు. అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు చికిత్స నిమిత్తం 10 లక్షలు ఆర్థిక సాయం కూడా చేస్తానని హామీ ఇచ్చారు. తమ అభిమాన హీరో నేరుగా ఇంటికే వచ్చి ఆర్థిక భరోసా ఇవ్వడంతో తెగ సంతోషపడింది గణేష్ కుటుంబం.