ముంబై, మే6 : బాలీవుడ్ నటి సోనమ్‌కపూర్ ఇంట్లో పెళ్లి బాజా మోగనుంది. సోనమ్‌కపూర్.. బిజినెస్ మ్యాన్ ఆనంద్ అహూజాను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనమ్ ఇంట్లో సంగీత్‌కు సంబంధించిన రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో చిన్నారుల నుండి పెద్దల వరకు అందరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోలో అర్జున్ కపూర్ ఆకర్షణగా నిలిచారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.