చెన్నైలో "కాలా" ఆడియో వేడుక..

SMTV Desk 2018-05-05 14:14:31  rajaneekanth, kala movie, audio launch, chennai.

చెన్నై, మే 5 : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.. "కాలా". అయితే చిత్రానికి సంబంధించిన పాటలను ఈ నెల తొమ్మిదో తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చెన్నై నందనంలోని వైఎంసీఏ మైదానంలో భారీ ఎత్తున ఈ ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రజనీ ఆడియో వేడుక లోపు తిరిగి చెన్నై రానున్నారు. వండ‌ర్ బార్ ఫిలింస్ బేన‌ర్‌పై ధ‌నుష్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 7న విడుద‌ల చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన "య‌మ గ్రేట్" అంటూ సాగే మాస్ పాట అభిమానులను ఎంతగానో అలరిస్తోంది.