పొట్ట తగ్గడానికి.. ఈ చిట్కాలు పాటించండి.

SMTV Desk 2018-05-03 18:05:30  HEAVY WEIGHT, OTHERS, HEALTH TIPS.

హైదరాబాద్, మే 3 : ప్రస్తుత కాలంలో జిహ్వచాపల్యాన్ని ఆపుకోవడం ఎంతో కష్టం.. కొంత మంది తింటే పొట్ట వస్తుందని.. పొట్ట వచ్చిన వాళ్లు తగ్గించుకోవాలనే మితంగా తింటారు. కానీ అది కాదు పరిష్కారం అంటారు నిపుణులు. కడుపు నిండా తినాలి.. అది కూడా కొన్ని పదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. ఇంతకీ అవేంటంటే.. >> పుచ్చకాయ.. ఇందులో ఎనభైరెండు శాతం నీరు ఉంటుంది. ఈ ముక్కలు రోజూ తీసుకుంటే గనుక.. పొట్ట నిండటమే కాదు. తేలిగ్గానూ అనిపిస్తుంది. పైగా ఇది శరీరంలో పేరుకున్న సోడియంను కూడా తొలగిస్తుంది. విటమిన్‌ సి.. రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. కప్పు పుచ్చకాయ ముక్కలు తీసుకుంటే అందే కెలొరీలు కేవలం వంద మాత్రమే. కాబట్టి రోజూ తీసుకోవచ్చు. >> బాదం.. ఈ పప్పులో విటమిన్‌-ఇ తో పాటూ మాంసకృత్తులూ, పీచూ ఉంటాయి. ఇవి కొన్ని తిన్నా.. పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. దాంతో త్వరగా ఆకలి వేయదు. వీటిల్లో కెలొరీలు ఎక్కువగా ఉన్నా.. పొట్ట తగ్గడానికి మాత్రం సాయపడతాయి. >> కీరదోస.. ఇందులో కెలొరీలు చాలా తక్కువ. పైగా తొంభైశాతం వరకూ నీరే ఉంటుంది. ఒక్క కీరా తింటే.. అందే కెలొరీలు కేవలం 45 మాత్రమే. ఆకలి వేయదు. అందుకే.. భోజనానికి ముందు ఒక కీరా తీసుకోగలిగితే అన్నం తక్కువ తినే ఆస్కారం ఉంటుంది. >> గింజలు.. అన్ని రకాల గింజల్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే.. అంత మంచిది. శరీరంలోని కొవ్వు కరగడంతో పాటూ.. కండరాలూ ఆరోగ్యంగా మారతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. శనగలూ, బఠాణీలూ, పెసల మొలకల్లాంటివి పావు కప్పు తిన్నా.. పొట్టనిండినట్లు అనిపిస్తుంది. ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. ఇదే బరువు తగ్గడానికి దారితీస్తుంది.