అనుష్క నీకు మెసేజ్ పంపా.. రిప్లై రాలేదు..

SMTV Desk 2018-05-02 18:29:06  anushka sharma, birthday wishes, amirtabh bacchan, twitter.

ముంబై, మే 2 : బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ మే 1వ తేదీన తన 30వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన భర్త విరాట్ కోహ్లి సహా పలువురు సినీ ప్రముఖులు ఆమెను విష్ చేస్తూ పలు పోస్టులు పెట్టారు. అయితే తన సహనటులకు తప్పకుండా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. అదే విధంగా నిన్న అనుష్క శర్మ ఫోన్ కు టెక్స్ట్ మెసేజ్ పంపించారట. కాని అనుష్క నుండి సమాధానం ఏమి రాకపోయేసరికి ట్విటర్‌ వేదికగా విష్‌ చేయాలని అమితాబ్‌ నిర్ణయించుకొని సరదాగా ట్వీట్ చేశారు. "అనుష్క నేను అమితాబ్ బచ్చన్.. నిన్న నీ ఫోన్ కు టెక్స్ట్ మెసేజ్ పంపాను కాని నీ నుండి ఎటువంటి సమాధానం రాలేదు. ఏమైందా అని ఆరా తీస్తే నువ్వు నంబర్ మార్చావని తెలిసింది. హ్యాపీ బర్త్ డే అనుష్క.. లవ్‌ అండ్‌ విషెస్‌.. నిన్న ఐపీఎల్ మ్యాచ్ లో చాలా అందంగా కనిపించావు" అంటూ ట్వీట్ చేశారు. దీనికి అనుష్క రిప్లై ఇస్తూ.. "నా పుట్టిన రోజును గుర్తు పెట్టుకొని విష్ చేసినందుకు ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేసింది.