ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్సులో పూజా హెగ్డే..!!

SMTV Desk 2018-05-02 18:13:39  pooja hegde, gym pics, ntr movie, trivikram srinivas, new movie.

హైదరాబాద్, మే 2 : యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా డీజే భామ పూజ హెగ్డే నటిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ శారీరకంగా ఎంతో చెమటోడుస్తూ కసరత్తులు చేశారు. మరి ఎన్టీఆర్ పక్కన నటించాలంటే పూజ కూడా ఆ మాత్రం నియమాలు పాటించక తప్పదు కదా.! అందుకోసమే ఈ అమ్మడు జిమ్ లో తెగ కసరత్తులు మొదలు పెట్టినట్లుంది. తాజాగా పూజా తన ట్విట్టర్ ఖాతాలో.. జిమ్ లో తను కసరత్తులు చేస్తున్న వీడియోలను పోస్ట్ చేసింది. ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్సులో మెరిసిపోతున్న పూజ ఎంతో గ్లామరస్ గా కనిపిస్తోంది. ఎన్టీఆర్ పక్కన నటించాలంటే ఆ మాత్రం ఉండాలి మరి.. అంటూ అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు.