‘నియో’ లో చందమామ కథలు..

SMTV Desk 2018-05-02 13:52:34  NIYO APP, CHANDAMAMA KATHALU, TIPS, OTHERS.

హైదరాబాద్, మే 1 : కొన్నేళ్ల క్రితం రాత్రి నిద్రపోయేటప్పుడు నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య మంచి మంచి నీతి కథలు చెప్పేవారు. చందమామ కథలు, రామాయణం, మహాభారతం, తెనాలి రామలింగడి సమయస్ఫూర్తి, పంచతంత్ర కథలు చెబుతుంటే ఊహాలోకంలో విహరిస్తూ నిద్రలోకి జారుకునే వాళ్లం. కానీ, ఇప్పటి తరానికి ఆ మధురానుభూతులు దక్కడం లేదు. కథలు చెప్పడం మాట అటుంచి ఈ డిజిటల్‌ యుగంలో హాయ్‌, బాయ్‌ చెప్పుకోవడానికే టైం సరిపోవట్లేదు. అందుకే, నిపుణులు ‘నియో’ అనే యాప్‌ను సిద్ధం చేశారు. దానిలో తల్లిదండ్రులు కానీ, తాతలు కథల్ని రికార్డు చేసి పంపితే పిల్లలు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వినొచ్చట. అంటే బిజీ జీవితంలో పిల్లలకు ఇది కాస్త ఉపశమనం అన్న మాట.