మీ శిరోజాల ఖరీదెంత..?

SMTV Desk 2018-05-01 16:04:08  hair matters, survey about hair, california, hyderabad

హైదరాబాద్, ఏప్రిల్ 30 : శిరోజాల ఖరేదేంటి? అనుకుంటున్నారా? అవునూ.. మీ వెంట్రుకల స్వభావాన్ని బలాన్ని బట్టి మీ కురులకు ఓ ధర ఉంటుంది. ఇదేదో మేము అషామాషిగా చెప్పట్లేదు. అమెరికాలో జరిగిన నిజం ముచ్చట ఇది. అక్కడ సగటు మహిళా ఏడాదికి 55వేల డాలర్లు జుట్టుకోసమే ఖర్చు పెడుతున్నదట..మరి మీరు..? అమ్మో.. జుట్టు పోషణకే అంతా ఖర్చు అని ఆశ్చర్యపోతున్నారా? ఇంతకి ఈ విషయం ఎలా బయట పడిందో తెలుసా? ‘లుక్ ఫెంటాస్టిక్ డాట్ కామ్’ అనే సంస్థ 2వేల మంది మహిళాల మీద నిర్వహించిన సర్వేలో తేలింది. జుట్టు అందంగా కనిపించడానికి, స్టైలిష్ లుక్ కోసం వేల డాలర్లు ఈజీగా ఖర్చు పెట్టేస్తున్నారట అమెరికన్ మగువలు. నెలలో 11 గంటల సమయం, ఎనభై డాలర్లు జట్టు కోసం, జట్టుకు పెట్టె ప్రొడక్ట్స్ కోసం ఖర్చు చేస్తున్నారట. ఇంతలా ఖర్చు చేస్తే జుట్టు ఖరీదైనదే కదా!అంటున్నారు లుక్ ఫెంటాస్టిక్ డాట్ కామ్ నిర్వాహకులు. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్, లాంటి అమెరికా రాష్ట్రాల్లో మహిళలు దాదాపు 120 డాలర్లు జుట్టుకే కేటాయిస్తున్నారట. కాలిఫోర్నియాలో నిర్వహించిన ‘క్లీనెస్ట్ హెయిర్’ పోటీలో కాలిఫోర్నియాకే మొదటిస్థానం వచ్చింది. దీన్ని బట్టి తెలుస్తుంది.. మహిళలు జుట్టుకు ఎంత ప్రాముఖ్యతనిస్తారో.