"మహానటి" కై ఎన్టీఆర్ రాక..!!

SMTV Desk 2018-05-01 15:20:58  MAHANATI MOVIE, AUDIO RELEASE, NTR CHIEF GUEST.

హైదరాబాద్, మే 1 : అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "మహానటి". కీర్తి సురేష్‌ టైటిల్‌రోల్‌ పోషిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, సమ౦త, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, శాలినీ పాండే తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ తో పాటు డబ్బింగ్ చెప్పడం కూడా పూర్తయింది. ఎవరి క్యారెక్టర్ కు వారే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. అయితే ఈ చిత్ర ఆడియోను నేడు రిలీజ్ చేయనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్‌ రానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ భరత్ అనే నేను ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు హాజరై సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. తాజాగా ఈ ఈవెంట్‌కు రావడం మరింత ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణా౦తర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నారు.