"రంగస్థలం" చిత్రం అద్భుతం : నారా లోకేష్

SMTV Desk 2018-04-30 15:14:28  nara lokesh, rangasthalam movie, lokesh comment,

హైదరాబాద్, ఏప్రిల్ 30 : రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన "రంగస్థలం" చిత్రం అనేక రికార్డుల దిశగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రంపై సినీ ప్రముఖులు, అభిమానులు పొగడ్తల వర్షం కురిపించారు. ఇప్పటికీ ఆ రంగస్థలం మేనియా నుండి బయటకు రాలేకపోతున్నారంటే అతిశయోక్తి లేదు. తాజాగా ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ వీక్షించారట. స్వయంగా ఈ విషయాన్ని లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అంతేకాదు ఈ చిత్రం అద్భుతంగా ఉందన్నారు. "రంగస్థలం లాంటి గొప్ప సినిమాను మాకు అందించినందుకు సుకుమార్, రామ్ చరణ్ లకు ధన్యవాదాలు. ఈ సినిమా చూసిన తర్వాత కూడా ఆ పాత్రలు అలా మనసుకు హత్తుకొని ఉండిపోతాయి. నిజంగా గ్రేట్ వర్క్ గాయ్స్" అంటూ లోకేష్ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన రామ్ చరణ్.. "థాంక్యూ నారా లోకేశ్ సర్" అంటూ పేర్కొన్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది.